తెలంగాణ

telangana

ETV Bharat / city

జస్టిస్ ఈశ్వరయ్య కేసు: హైకోర్టు ఆదేశాలను కొట్టేసిన సుప్రీం - justice eswaraiah phone call case

జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణపై ఏపీ హైకోర్టు ఆదేశించిన దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈమేరకు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

justice eswaraiah phone call case latest updates
జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణ కేసులో సుప్రీం తీర్పు

By

Published : Apr 12, 2021, 3:22 PM IST

జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణపై ఏపీ హైకోర్టు ఆదేశించిన దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టులో దాఖలైన పిల్ మెరిట్స్ జోలికి తాము వెళ్లట్లేదని స్పష్టం చేసింది. పిల్ మెయింటైనబిలిటీని హైకోర్టు పరిగణించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి ధర్మాసనం తీర్పు వెల్లడిచింది.

హైకోర్టు ఆదేశాలు..

మేజిస్ట్రేట్‌తో జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్లో వివాదాస్పదంగా మాట్లాడారని హైకోర్టు విచారణకు ఆదేశించింది. ఫోన్ సంభాషణలో కుట్ర కోణం ఉందో.. లేదో తేల్చాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ రవీంద్రన్‌ను నియమించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి:అటవీ సిబ్బందిని చెట్టుకు కట్టేసి కొట్టిన గిరిజనులు

ABOUT THE AUTHOR

...view details