Ganesh Immersion: హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై నేడు సుప్రీంలో విచారణ
11:54 September 15
Ganesh Immersion: హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై నేడు సుప్రీంలో విచారణ
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం అంశంపై సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించగా.. నేడు విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. హుస్సేన్‌సాగర్‌తో పాటు జంట నగరాల్లోని ఇతర జలాశయాల్లో పీవోపీ వినాయక విగ్రహాల నిమజ్జనం చేయొద్దన్న హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు తలుపుతట్టింది. నిమజ్జనంపై నేడు సుప్రీం కోర్టు విచారణ జరపనుంది.
సుప్రీం కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని అధికారులు ఆశిస్తున్నారు. ఒకవేళ అనుకూలంగా తీర్పు రాకుంటే నిమజ్జనం విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై ఇప్పటికే ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. మరోవైపు గ్రేటర్లో నిర్మించిన 25 నీటి కొలనులకు కూడా జీహెచ్ఎంసీ మరమ్మతులు పూర్తి చేసి నిమజ్జనానికి సిద్ధం చేస్తోంది.
ఇదీ చూడండి: