తెలంగాణ

telangana

సికింద్రాబాద్-విశాఖ‌ మధ్య సూపర్‌ఫాస్ట్‌ ప్రత్యేక రైళ్లు

By

Published : Jan 22, 2021, 9:39 AM IST

విశాఖ-సికింద్రాబాద్‌ మధ్య సూపర్‌ఫాస్ట్‌ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తూర్పుకోస్తా రైల్వే తెలిపింది. ఈనెల 27న సికింద్రాబాద్-విశాఖ రైలు ప్రారంభం కానుంది. ఈనెల 28 నుంచి విశాఖ-సికింద్రాబాద్‌ రైలు సేవలు మొదలవుతాయి. రైళ్లలో ఒక ఫస్ట్‌ ఏసీ, 3 సెకెండ్‌ ఏసీ, 11 థర్డ్‌ ఏసీ బోగీలు ఉంటాయి.

విశాఖ-సికింద్రాబాద్‌ మధ్య సూపర్‌ఫాస్ట్‌ ప్రత్యేక రైళ్లు
విశాఖ-సికింద్రాబాద్‌ మధ్య సూపర్‌ఫాస్ట్‌ ప్రత్యేక రైళ్లు

విశాఖ- సికింద్రాబాద్ మధ్య సూపర్ ఫాస్ట్ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తూర్పుకోస్తా రైల్వే ప్రకటించింది. 02204 నంబర్ రైలు సికింద్రాబాద్​లో రాత్రి 8 గంటల 15 నిమిషాలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 6 గంటల 25 నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది. ఈ నెల 27 నుంచి సోమ, బుధ, శనివారాల్లో ఈ సేవలు ప్రారంభమవుతాయి.

02203 నంబర్ రైలు విశాఖలో రాత్రి 7 గంటల 50 నిమిషాలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 6 గంటల 5 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈనెల 28 నుంచి ప్రతీ మంగళ, గురు, ఆదివారాల్లో ఈ రైలు నడపనున్నారు. ఈ రైళ్లకు గుంటూరు, విజయవాడలో మాత్రమే స్టాపులు ఉండనున్నాయి. ఈ రైళ్లలో 11 థర్డ్ ఏసీ, 3 సెకెండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ బోగీలు ఉంటాయని.. తూర్పుకోస్తా రైల్వే తెలిపింది.

ఇవీచూడండి:'పారదర్శకత కోసమే వాట్సప్​లో మార్పుల ప్రతిపాదన'

ABOUT THE AUTHOR

...view details