సికింద్రాబాద్ సన్ సైన్ ఆస్పత్రిలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తిచేసినట్లు ఆస్పత్రి ఎండీ డాక్టర్ గురువారెడ్డి వెల్లడించారు. ఇటీవల ఎల్బీనగర్ కామినేనిలో బ్రెయిన్ డెడ్ అయిన రైతు కాలేయాన్ని... విశ్రాంత అధ్యాపకుడు అనంతయ్యకు అమర్చారు.
దిగ్విజయంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స - liver Transplantation success
ఇటీవల ఎల్బీనగర్ కామినేనిలో బ్రెయిన్ డెడ్ అయిన రైతు కాలేయాన్ని... విశ్రాంత అధ్యాపకుడు అనంతయ్యకు దిగ్విజయంగా అమర్చారు సన్ సైన్ ఆస్పత్రి వైద్యులు. దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు.
దిగ్విజయంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స
ఈ తరహా శస్త్రచికిత్స తమ ఆస్పత్రిలో తొలిసారి అని తెలిపారు. డాక్టర్ విమాలాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు 5 గంటలపాటు శస్త్రచికిత్సను నిర్వహించినట్లు చెప్పారు. తాజా శస్త్రచికిత్సతో హైదరాబాద్ ఎలైట్ క్లబ్ ఆఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్స్‌లో.. తమ ఆస్పత్రికి స్థానం దక్కినట్లు తెలిపారు.
ఇవీ చూడండి:నేటి నుంచి ఆరోగ్య సిబ్బందికి రెండో డోసు వ్యాక్సినేషన్