తెలంగాణ

telangana

ETV Bharat / city

సన్​రైజర్స్​కు హైదరాబాదీల ఫుల్​ సపోర్ట్​... తీగల వంతెనపై మెరిసిన లోగో - రెండో క్వాలిఫైయర్ మ్యాచ్

మొదటి ఎలిమినేటర్ మ్యాచ్​లో విజయం సాధించిన సందర్భంగా... రెండో మ్యాచ్​లో విజయం సాధించాలనే కాంక్షతో... దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జ్​పై సన్​రైజర్స్​ లోగోను విద్యుత్​దీప కాంతులతో ఆవిష్కరించారు. వంతెన తీగలను సన్​రైజర్స్ ఆరెంజ్ కలర్​ విద్యుత్ దీపాలతో అలంకరించారు. విద్యుత్​ కాంతుల్లో కేబుల్​ బ్రిడ్జ్​ మరింత అందంగా దర్శనమిచ్చింది.

sunrisers logo shined on cable bridge in hyderabad
sunrisers logo shined on cable bridge in hyderabad

By

Published : Nov 8, 2020, 2:28 PM IST

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సన్​రైజర్స్​ లోగోతో వెలిగిపోయింది. ఐపీఎల్​లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్​లో రాయల్ చాలేంజర్స్ బెంగళూరుపై సన్​రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించిన సందర్భంగా... బ్రిడ్జ్​పై విద్యుత్​ కాంతులతో సన్​రైజర్స్​ లోగోను ఆవిష్కరించారు. ఇవాళ జరగనున్న రెండో ఎలిమినేటర్​ మ్యాచ్​లోనూ గెలవాలని నగరవాసుల ఆకాంక్షను తెలియజేస్తూ... వంతెన తీగలను సన్​రైజర్స్ ఆరెంజ్ కలర్​ విద్యుత్ దీపాలతో అలంకరించారు.

తీగల వంతెనపై మెరిసిన సన్​రైజర్స్​ లోగో

విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్న వంతెన ఫోటోలను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ట్విట్టర్​లో పెట్టారు. ఈ అలంకరణతో బ్రిడ్జిని చూసి నగర వాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఇవాళ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్​లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు... దిల్లితో ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే సన్ రైజర్స్ జట్టు ఫైనల్​లో ముంబాయితో తలపడనుంది. ఇప్పటికే హైదరాబాద్ జట్టు ఐపీఎల్ టైటిల్​ను గెలిచుకోవాలని అభిమానులు... ప్రేక్షకులు ఆకాంక్షిస్తున్నారు.

తీగల వంతెనపై మెరిసిన సన్​రైజర్స్​ లోగో
తీగల వంతెనపై మెరిసిన సన్​రైజర్స్​ లోగో

ఇదీ చూడండి: పర్వదినాల మాసం... మహిమాన్విత కార్తికం

ABOUT THE AUTHOR

...view details