హైదరాబాద్ ట్యాంక్‌బండ్ ఆటపాటలతో హోరెత్తింది. నగరవాసులకు సరికొత్త ఆహ్లాదాన్ని అందించింది. ట్యాంక్‌బండ్‌పై సన్‌డే-ఫన్‌డే (Tank Bund Sunday Funday) ఈసారి కూడా సందడిగా సాగింది. గణేశ్ నిమజ్జనం కారణంగా గతవారం నిలిపివేసిన కార్యక్రమం ఇవాళ మళ్లీ షురూ అయింది. ఈసారి రైల్వే రక్షక దళం ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా... ఆర్పీఎఫ్ బ్యాండ్‌మేళా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Tank Bund Sunday Funday : ఆటపాటలతో హోరెత్తిన ట్యాంక్‌బండ్... ఈసారి స్పెషల్ అట్రాక్షన్! - ట్యాంక్ బండ్ వార్తలు
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సన్‌డే-ఫన్‌డే (Tank Bund Sunday Funday) ఈసారి కూడా సందడిగా సాగింది. ఆటపాటలతో నగరవాసులకు ఆహ్లాదాన్ని అందించింది. రైల్వే రక్షక దళం ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా... ఆర్పీఎఫ్ బ్యాండ్‌మేళా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Tank Bund Sunday Funday
బాణాసంచా వెలుగులతో పాటు సంప్రదాయ, జానపద కళప్రదర్శనలు కనులవిందు చేశాయి. ఒగ్గుడోలు, గుస్సాడీ, బోనాలు, కోలాటం సందడిగా సాగాయి. పాతబస్తీ గాజులు, ముత్యాలు, ఆభరణాల స్టాళ్లు, చేనేతలు, హస్తకళల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎస్పీ బాలు పాటలతో సంగీత విభావరి నగరవాసులను ఆకట్టుకుంది.
ఇదీ చదవండి :'గులాబ్'పై అప్రమత్తం.. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలని సీఎస్ ఆదేశం