తెలంగాణ

telangana

ETV Bharat / city

Sunday Fun day at Tank Bund : ట్యాంక్​బండ్​పై సండే.. నగరవాసులకు జాలీ డే - హైదరాబాద్​లో సండే ఫన్ డే కార్యక్రమం

హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ఆదివారం రోజున నగరవాసులు(Sunday Funday at Tank Bund) ఆనందంగా గడిపారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చి ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. చిన్నా,పెద్దా తేడా లేకుండా సరదాగా కేరింతలు కొట్టి ఆడిపాడారు. ట్యాంక్‌బండ్‌ అందాలతో పాటు విద్యుత్‌ ధగధలతో మెరిసిపోతున్న బుద్ధ విగ్రహం చూస్తూ మంత్రముగ్దులయ్యారు. పిల్లల ఆట వస్తువులతో పాటు నోరూరించే వంటకాలను ఆస్వాదించారు. వాహనాల రాకపోకలు లేకపోవడంతో సాయంసంధ్యావేళ హుసేన్‌ సాగర్‌ అందాలను వీక్షిస్తూ నడక సాగించారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.

Sunday Fun day at Tank Bund
Sunday Fun day at Tank Bund

By

Published : Nov 1, 2021, 8:20 AM IST

ఆదివారం వచ్చిందంటే చాలు హైదరాబాద్​ ట్యాంక్‌బండ్‌ నగరవాసులతో సందడిగా మారుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాలను నుంచి కుటుంబ సమేతంగా తరలివస్తోన్న సందర్శకులు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు. ట్యాంక్‌బండ్‌పై చిన్నారుల సరదాలు చూస్తూ పెద్దలు మురిసిపోతూ.. తమ పిల్లల తీపి జ్ఞాపకాలను స్మార్ట్‌ఫోన్‌లో బందిస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే ట్యాంక్​బండ్​కు పయనమవుతున్న వారంతా.. ఇక్కడికి వస్తే ఓ పర్యాటక ప్రాంతానికి వెళ్లిన అనుభూతి కలుగుతోందని చెబుతున్నారు.

బిజీబిజీ లైఫ్​తో క్షణం తీరికలేకుండా గడుపుతున్న నగరవాసులకు వారాంతాల్లో కాస్త సేద తీరేందుకు ఓ అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో హెచ్​ఎండీఏ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ట్యాంక్​బండ్​ వద్ద సన్ డే ఫన్ డే(Sunday Funday at Tank Bund) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పిల్లలు, పెద్దలు, అందరు కుటుంబ సమేతంగా వచ్చి తమ రెగ్యులర్ లైఫ్ నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు. విద్యుద్దీపాల అలంకరణలో మెరిసిపోతున్న ట్యాంక్ బండ్​ను చూస్తూ మైమరిచిపోతున్నారు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ట్యాంక్​బండ్​ను.. రంగులదీపాల కాంతుల్లో చూస్తూ పరవశించిపోతున్నారు.

పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు, పెద్దలకు కావాల్సిన యాక్సెసరీస్, నోరూరించే వంటకాలు.. ఇవన్నీ నగరవాసులను ఆదివారం వచ్చిందంటే ట్యాంక్​ బండ్​ వైపునకు మర్లేలా చేస్తోంది. గతంలో కంటే ట్యాంక్‌బండ్‌ ఇప్పుడు చాలా బాగుందని అంటున్నారు నగరవాసులు. ఆదివారం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు. ఒకప్పుడు ట్యాంక్‌బండ్‌పైకి రావాలంటే రద్దీ వల్ల భయంగా ఉండేదని..ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని అంటున్నారు.

సన్‌ డే ఈజ్‌ ఫన్‌ డే కార్యక్రమం(Sunday Funday at Tank Bund) చాలా బాగుందని.. ఇక్కడ అన్నీ రకాలైన వస్తువులు లభించడంతో పాటు కుటుంబంతో కలిసి కాలక్షేపం చేసేందుకు కావాల్సిన అన్నీ రకాలైన ఏర్పాట్లు చేశారని నగరవాసులు అంటున్నారు. ఈ కార్యక్రమం కొత్తగా ఉందని.. ఇలాంటివి మరికొన్ని కార్యక్రమాలు చేపడితే.. తమ ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాస్త రీఫ్రెష్ అవుతామని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details