తెలంగాణ

telangana

ETV Bharat / city

అద్భుత దృశ్యం.. శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు - ఉరవకొండ శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు

ఏపీలోని అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని రాయంపల్లి గ్రామంలోని పురాతన రామలింగేశ్వర స్వామి శివాలయంలో అద్భుత ఘటన జరిగింది. శివలింగాన్ని ఈ రోజు ఉదయం సూర్య కిరణాలు తాకాయి.

sun-rays-touched-siva-linga-at-uravakonda
శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు

By

Published : Sep 28, 2020, 5:33 PM IST

ఏపీలోని అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని రాయంపల్లి గ్రామంలో ఉన్న పురాతన రామలింగేశ్వర స్వామి శివాలయంలో అద్భుత ఘటన చోటు చేసుకుంది. శివలింగాన్ని ఈరోజు ఉదయం సూర్య కిరణాలు తాకాయి. ఉదయం అర్చకుడు గుడి తలుపులు తెరవగానే ఈ అద్భుత దృశం కనిపించిందని తెలిపారు.

ఏటా ఈ మాసంలో ఏదో ఒకరోజు రవి కిరణాలు శివలింగం మీద పడుతుంటాయని గ్రామస్థులు తెలిపారు. అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూడటానికి గ్రామస్థులు ఆలయానికి తరలివచ్చారు.

ఇదీ చదవండి: కృష్ణమ్మ పరవళ్లు.. ప్రకాశం బ్యారేజ్ డ్రోన్ వీడియో

ABOUT THE AUTHOR

...view details