ఏపీలోని పాఠశాలలకు.. మే 6 నుంచి జూలై 3వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 4వ తేదీలోగా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అవసరమైన పరీక్షల నిర్వహణను పూర్తి చేయాలని.. పాఠశాల విద్య కమిషనర్ సురేశ్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. జులై 4వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
పాఠశాలలకు వేసవి సెలవులు.. ఎప్పటి నుంచి అంటే? - సమ్మర్ హాలిడేలు
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 6 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది.
పాఠశాలలకు వేసవి సెలవులు.. ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణలో రేపటి(ఏప్రిల్ 24) నుంచి జూన్ 12వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొంది. జూన్ 13న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగుతాయి. ప్రధాన పరీక్షలు మే 28వ తేదీతో ముగుస్తాయి. ఆ విద్యార్థులకు మే 22 వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి.
ఇవీ చదవండి: