భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన వినయ్‌కు 2018లో సుహాసినితో పరిచయం ఏర్పడింది. తాను అనాథనని, ప్రేమించానని చెప్పడంతో 2019లో పెళ్లి చేసుకున్నట్లు వినయ్(vinay) తెలిపాడు. వివాహం చేసుకున్న కొద్ది రోజులకే సుహాసిని ప్రవర్తన సరిగా లేకపోగా.. తనకు తెలియకుండా తన బంధువుల నుంచి డబ్బులు తీసుకోవటం గమనించానని చెప్పాడు.
సుహాసిని మొదటి భర్త వెంకటేశ్వర్లు, ఆమె ఇద్దరు పిల్లలను ఇంటికి పిలిపించి బంధువులుగా పరిచయం చేసినట్లు వినయ్ వెల్లడించారు. తన బంధువుల దగ్గర నుంచి తీసుకువచ్చిన రూ.పది లక్షలతో పాటు.. రూ.5 లక్షల విలువైన బంగారం తీసుకుని సుహాసిని(suhasini) పారిపోయినట్లు చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. వారు పట్టించుకోకపోవడంతో.. ఆమె మోసాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు.