135 రోజుల పరుగుల యాత్ర చేపట్టిన పరుగుల రాణి సుఫియా... ఏపీలోని నెల్లూరు జిల్లా కావలికి చేరింది. దిల్లీకి చెందిన సుఫియా... తన పరుగుల యాత్రలో నాలుగు మెట్రో సిటీలను చూశానని తెలిపింది. దిల్లీ నుంచి ముంబయి మీదుగా చెన్నై వచ్చి... చెన్నై నుంచి కలకత్తా మీదుగా తిరిగి దిల్లీ చేరేలా 6000 కిలోమీటర్లు తన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.
వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు లక్ష్యంగా.. సుఫియా సాహసం - Sufia Adventure for Aiming for the Guinness Book of World Record news
135 రోజుల్లో 6వేల కిలోమీటర్ల పరుగు సాధ్యమా..? సాధ్యమే అంటుంది దిల్లీకి చెందిన సుఫియా. సుఫియా తన పేరుతో పాటుగా భారతదేశం పేరును వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చూడాలనే తపనతో వేల కిలోమీటర్ల పరుగు పందెేన్ని స్వీకరించానంటుంది. ఇప్పటికే 3000 కిలోమీటర్లు వచ్చానని.. ఇంకా 3000 కిలోమీటర్ల లక్ష్యం తన ముందుందని చెబుతోంది.
![వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు లక్ష్యంగా.. సుఫియా సాహసం వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు లక్ష్యంగా.. సుఫియా సాహసం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10595951-370-10595951-1613119514651.jpg)
వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు లక్ష్యంగా.. సుఫియా సాహసం
ఇప్పటికే... 3 వేల కిలోమీటర్ల లక్ష్యం చేరానని... ఇంకా 3000 కిలోమీటర్లు పూర్తి చేయాల్సి ఉందని వివరించింది. తనతో పాటు తన టీమ్ కూడా ఉందని చెప్పింది. తన మీద తనకున్న నమ్మకంతో వరల్డ్ బుక్ ఆఫ్ గిన్నిస్ రికార్డును చేజిక్కించుకొనేందుకే ఈ పరుగు పందెం ఎంచుకున్నానంటుంది సుఫియా.
ఇదీ చదవండి:పంచాయతీ ఎన్నికలపై ఒడిశా పిటిషన్.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు