ఆర్టీసీ కార్మికుల సమ్మె సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సమయానికి బస్సులు లేక నగరంలో విద్యార్థులు, ఉద్యోగులు గంటల తరబడి బస్టాపుల్లో నిరీక్షిస్తున్నారు. సరిపడ బస్సలు లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం వల్ల జేబులు ఖాళీ అవుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే కూకట్పల్లిలో అరకొరగా తిరుగుతున్న ఆర్టీసీ బస్సులతో ప్రజల ఇక్కట్లు పడుతున్నారు. డిపోలో మొత్తం 138 బస్సులుండగా కేవలం 55 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితే అన్ని డిపోల్లోను కనబడుతోంది.
సమ్మె దెబ్బకు ప్రజల జేబులకు చిల్లు
ఆర్టీసీ సమ్మెతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారుల కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి. సరిపడ బస్సులు లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం వల్ల జేబులు గుల్లవుతున్నాయి.
సమ్మె దెబ్బకు ప్రజల జేబులకు చిల్లు