మండే ఎండాకాలంలో ఒక్కసారిగా కురిసిన వర్షం భాగ్యనగరవాసులకు కాస్త ఉపశమనాన్ని కలిగించింది. కొన్ని రోజులుగా ఎండలు విజృంభిస్తున్న తరుణంలో కాసేపు వాతావరణం చల్లబడి వర్షం పడటం వల్ల నగరవాసులు చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు.
హైదరాబాద్లో వర్షం.. నగరవాసులకు ఆహ్లాదం - rain in Hyderabad
భానుడి ఉగ్రరూపంతో విలవిలలాడుతున్న భాగ్యనగర ప్రజలకు వర్షం కురవడంతో కాస్త ఉపశమనం కలిగింది. ఒక్కసారిగా చల్లబడిన వాతావరణంతో నగరవాసులు ఆహ్లాదం పొందారు.

హైదరాబాద్లో వర్షం, సికింద్రాబాద్లో వర్షం, సికింద్రాబాద్లో వాన, తెలంగాణలో వర్షం
సికింద్రాబాద్లోని బోయిన్పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, అల్వాల్, జేబీఎస్ ప్రాంతాల్లో అరగంటపాటు వర్షం కురిసింది. దిల్సుఖ్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్లోనూ చిరుజల్లులతో కూడిన వాన పడింది. ఉక్కపోత మూలంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు చల్లటి వాతావరణం ఆహ్లాదాన్ని కలిగించింది.
- ఇదీ చదవండిఆందోళన చెందొద్దు.. అనుమాన పడొద్దు...