తెలంగాణ

telangana

ETV Bharat / city

'సీఎంవోలో పనిచేస్తున్న ఓ ముఖ్య అధికారిని పిలిపించాలి'

తనపై శాఖాపరమైన విచారణలో వివిధ అంశాలను తెలుసుకునేందుకు సీఎంవోలో పనిచేస్తున్న ఓ ముఖ్య అధికారిని పిలిపించాలని ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కమిషనర్ ఆఫ్​ ఎంక్వైరీస్​ను కోరారు. తనకు వేతనం నిలిపివేస్తూ 2020 జనవరి నెలలో సీఎస్ కార్యాలయం- డీజీపీ కార్యాలయం మధ్య నడిచిన దస్త్రాలను తెప్పించాల్సిందిగా అభ్యర్థించారు.

By

Published : Mar 19, 2021, 12:03 AM IST

submission-of-evidence-to-the-commissioner-of-inquiries-over-ab-venkateswar-case
'సీఎంవోలో పనిచేస్తున్న ఓ ముఖ్య అధికారిని పిలిపించాలి'

తనపై శాఖాపరమైన విచారణలో వివిధ అంశాలను తెలుసుకునేందుకు సీఎంవోలో పనిచేస్తున్న ఓ ముఖ్య అధికారిని పిలిపించాలని ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్​ను కోరారు. ఏసీబీలోని సీఐయూ విభాగం డిప్యూటీ డైరెక్టర్ సాయికృష్ణ, సీఐడీ డీఎస్పీ విజయపాల్​ను కూడా పిలిపించాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆర్పీ సిసోడియా చేపట్టిన తొలిరోజు విచారణకు హాజరైన ఏబీవీ... వివిధ ఆధారాలను సమర్పించారు. నిఘా పరికరాల కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందాలు, ప్రభుత్వ ఆదేశాలు, కేంద్ర హోంశాఖ, డీజీఎఫ్​టీ, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఐజీ సహా వేర్వేరు విభాగాలు ఇచ్చిన నివేదికలు, లేఖలను సమర్పించారు.

తనను సస్పెండ్ చేయడానికి నెలరోజులు ముందుగానే వేతనం నిలిపివేశారని.. కుట్ర పూరితంగా తనను తప్పుడు కేసులో ఇరికించేందుకు తీసుకున్న నిర్ణయం కంటే ముందే ఈ వ్యవహారం జరిగిందన్నారు. తనకు వేతనం నిలిపివేస్తూ 2020 జనవరి నెలలో సీఎస్ కార్యాలయం- డీజీపీ కార్యాలయం మధ్య నడిచిన దస్త్రాలను తెప్పించాల్సిందిగా ఏబీ వెంకటేశ్వరరావు కోరారు. తన తరపున వాదనలు వినిపించేందుకుగానూ ఈ దస్త్రాలు కీలకమవుతాయని పేర్కొన్నారు.

ఇదీ చూడండి :అభ్యర్థిపై తేల్చుకోలేకపోతున్న కమలనాథులు

ABOUT THE AUTHOR

...view details