తెలంగాణ

telangana

ETV Bharat / city

జేఎన్​టీయూలో ర్యాగింగ్ కలకలం.. 11 మంది విద్యార్థుల సస్పెండ్ - జేఎన్​టీయూ కాకినాడలో ర్యాగింగ్

Ragging in JNTUK: ఏపీలోని కాకినాడ జేఎన్​టీయూలో ర్యాగింగ్​ కలకలం రేపింది. ఈ ఘటనలో 11 మంది విద్యార్థులను రెండు వారాలపాటు సస్పెండ్ చేసినట్లు వర్సిటీ ఉపకులపతి ప్రసాదరాజు తెలిపారు.

జేఎన్​టీయూలో ర్యాగింగ్ కలకలం.. 11 మంది విద్యార్థుల సస్పెండ్
జేఎన్​టీయూలో ర్యాగింగ్ కలకలం.. 11 మంది విద్యార్థుల సస్పెండ్

By

Published : Jun 25, 2022, 7:12 PM IST

Students Suspended in Ragging Case at JNTUK: ఆంధ్రప్రదేశ్​లోని జేఎన్​టీయూ కాకినాడలో ర్యాగింగ్​ కలకలం రేపింది. ర్యాగింగ్​కు పాల్పడిన 11 మంది విద్యార్థులపై సస్పెన్షన్​ వేటు పడింది. సదరు విద్యార్థులను 14 రోజుల పాటు తరగతులు, రెండు నెలల పాటు వసతిగృహం నుంచి సస్పెండ్ చేసినట్లు యూనివర్సిటీ ఉపకులపతి ప్రసాదరాజు తెలిపారు.

మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థిని ఇంటరాక్షన్ పేరిట ర్యాగింగ్ చేసినట్టు యూజీసీ యాంటీ ర్యాగింగ్ వెబ్​సైట్​కు ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదుపై విశ్వవిద్యాలయం యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ చేపట్టింది. కమిటీ నివేదిక ఆధారంగా ఇద్దరు మొదటి ఏడాది, 9 మంది తృతీయ సంవత్సరం విద్యార్థులను రెండు వారాలపాటు సస్పెండ్ చేసినట్టు ఉపకులపతి ప్రసాదరాజు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details