తెలంగాణ

telangana

ETV Bharat / city

Afghan Crisis: 'అఫ్గాన్ విద్యార్థులకు అండగా నిలబడదాం'

అప్గాన్​లో ప్రస్తుత పరిస్థితులపై ఏపీలో విద్యనభ్యసిస్తున్న ఆ దేశ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తాలిబన్లు అఫ్గానిస్థాన్ అధ్యక్ష భవనాన్ని ఆక్రమించుకోవడం సహా తదనంతర పరిణామాలు వీరిని తీవ్రంగా కలిచివేస్తున్నాయి. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎలా ఉన్నారోనని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అఫ్గాన్​ పౌరులకు అండగా నిలవాలని వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు కోరుతున్నారు.

afghan
అఫ్గాన్

By

Published : Aug 17, 2021, 8:01 PM IST

Updated : Aug 17, 2021, 9:29 PM IST

భారత్- అఫ్గానిస్థాన్ మధ్య సాంఘిక, ఆర్థిక, వాణిజ్య బంధాలకు ప్రతీకగా ఎంతో మంది విద్యార్థులు దేశంలోని వివిధ విద్యా సంస్థల్లో చదువుతున్నారు. వీరు పూర్తిగా భారత ప్రభుత్వ ఉపకార వేతనాలతోనే చదువు కొనసాగిస్తున్నారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం విదేశీ విద్యార్థులకు పెద్దఎత్తున ఆశ్రయమిస్తోంది. ఇందులో ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందిన వారు వివిధ కోర్సులు పూర్తిచేసుకుని స్వదేశానికి వెళ్తుంటారు. ఇక్కడ చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో సుమారు 130 మంది అఫ్గానిస్థాన్‌ వాళ్లే ఉన్నారు. ప్రస్తుతం అఫ్గాన్‌లో పరిణామాలపై వీరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అప్గాన్​లో శాంతి ఏర్పడి ప్రజా సంక్షేమం దిశగా పయనిస్తున్న పరిస్ధితుల్లో తాలిబన్లు తిరిగి అధికారంలోనికి వస్తే ప్రజా సంక్షేమమే కాకుండా వారి మనుగడ కూడా ప్రశ్నార్థకం అయిపోతుందేమోనన్న భయం విద్యార్థుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తాము ప్రజలను హింసించమని చెబుతున్నప్పటికీ... గతంలో వారి పాలనలో ప్రజలు అనుభవించిన నరక యాతనలను గుర్తు చేసుకొని దిగులు చెందుతున్నారు. విదేశీ జోక్యంతో తాలిబన్లతో శాంతి చర్చలు జరగాలని అప్గాన్​, నైజీరియా, నేపాల్‌ విద్యార్థులు కోరుతున్నారు.

తాలిబన్లు అఫ్గాన్​ను ఆక్రమించుకోవడంతో ఆ ప్రభావం కశ్మీర్​పై ఉంటుంది. ఇండియాకు దగ్గరగా ఉండటం వల్ల ఆ ప్రభావం మా దేశంపై కూడా ఉంటుంది. అఫ్గానిస్థాన్​లో అమెరికాకు చెందిన ఓ జర్నలిస్ట్ బుర్ఖా ధరించి రిపోర్టింగ్ చేయడం చూశా. జర్నలిస్టుల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

-- శివాని, నేపాల్

దురదృష్టకరంగా అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు ఆక్రమించుకున్నారు. ప్రజలకు క్షమాభిక్ష పెట్టినట్లు ప్రస్తుతానికి తాలిబన్లు ప్రకటించారు. కానీ గతంలో వారి పాలనలో అఫ్గాన్​ ప్రజలు పడిన నరకయాతన కలవరపాటుకు గురిచేస్తోంది.

-- సయ్యద్ రషీద్ సిద్దికీ, అఫ్గానిస్థాన్

'అఫ్గాన్ విద్యార్థులకు అండగా నిలబడదాం'

ఇదీ చూడండి:-భారత్‌ కానుక తాలిబన్ల వశం.. పార్కులనూ వదల్లేదు!

Last Updated : Aug 17, 2021, 9:29 PM IST

ABOUT THE AUTHOR

...view details