తెలంగాణ

telangana

ETV Bharat / city

Students Reached Vijayawada: 'మాకిది పునర్జన్మ' ఉక్రెయిన్ నుంచి చేరుకున్న విద్యార్థుల ఉద్వేగం - ukraine crisis

Students reached vijayawada: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మరికొంత మంది తెలుగు విద్యార్థులు ఆదివారం రెండు విడతల్లో రాష్ట్రానికి చేరుకున్నారు. అధికారులు వారిని దగ్గరుండి వారి స్వస్థలాలకు పంపారు. క్షేమంగా తిరిగొచ్చిన బిడ్డలను చూసి తల్లిదండ్రులు ఉద్వేగానికి లోనై, కన్నీటి పర్యంతమయ్యారు.

Students Reached Vijayawada: 'మాకిది పునర్జన్మ' ఉక్రెయిన్ నుంచి చేరుకున్న విద్యార్థుల ఉద్వేగం
Students Reached Vijayawada: 'మాకిది పునర్జన్మ' ఉక్రెయిన్ నుంచి చేరుకున్న విద్యార్థుల ఉద్వేగం

By

Published : Feb 28, 2022, 9:51 AM IST

Students reached vijayawada: ఉక్రెయిన్‌ నుంచి మరి కొంతమంది తెలుగు విద్యార్థులు క్షేమంగా వారి స్వస్థలాలకు చేరుకున్నారు. విజయవాడ విమానాశ్రయానికి ఆదివారం ఉదయం ఇద్దరు విద్యార్థులు రాగా... సాయంత్రం 7 గంటలకు మరో నలుగురు చేరుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన వైద్య విద్యార్థిని స్కందన హైదరాబాద్ చేరుకుంది. అక్కడి నుంచి తమ స్వస్థలానికి అధికారులు క్షేమంగా తీసుకొచ్చారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులను చూసి ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు.

కళ్లకు కట్టినట్లు వివరించారు..
దిల్లీ నుంచి బెంగుళూరు వచ్చిన మదనపల్లికి చెందిన విద్యార్థులను రెవెన్యూ అధికారులు దగ్గరుండి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఉక్రెయిన్‌లోని పరిస్థితులను వారు కళ్లకు కట్టినట్లు వివరించారు. రాజధాని కీవ్​లో విమానాలు రాకపోకలు ఆపేయడంతో 250 మంది విద్యార్థులు 10 కిలోమీటర్లు నడుచుకుంటూ రాత్రిపూట మరో విమానాశ్రయానికి చేరుకున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంపై కృతజ్ఞతలు తెలిపారు.

సొంత ఊరుకు రావడం పునర్జన్మ లాంటిది..
విపత్కర పరిస్థితులలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సొంత ఊరుకు రావడం పునర్జన్మ అని ఉక్రెయిన్ నుంచి వచ్చిన కడపకు చెందిన గౌతమి అన్నారు. తనతో పాటు తన స్నేహితులు కూడా వచ్చి ఉంటే మరింత సంతోషంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మరికొంతమంది విద్యార్థులను క్షేమంగా తీసుకురావాలని తల్లిదండ్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నారు.

'మాకిది పునర్జన్మ' ఉక్రెయిన్ నుంచి చేరుకున్న విద్యార్థుల ఉద్వేగం

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details