ఓ వైపు కరోనా కోరలు చాస్తుంటే.. పరీక్షలు నిర్వహిస్తామంటూ తెలంగాణ సర్కార్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమడుతోందని ఎన్ఎస్యూఐ ఆరోపించింది. బీటెక్ రెండు, మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు రద్దు చేసి పైతరగతులకు ప్రమోట్ చేయాలని హైదరాబాద్ జేఎన్టీయూ వద్ద ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. 50 శాతం ఫీజు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
'పరీక్షల పేరుతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?' - students protest at JNTU Hyderabad
కరోనా వ్యాప్తి దృష్ట్యా పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో జేఎన్టీయూ ప్రధాన గేటు వద్ద ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకోవడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
!['పరీక్షల పేరుతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?' students protest against b.tech exams during corona pandemic](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9055073-230-9055073-1601886288322.jpg)
జేఎన్టీయూ వద్ద విద్యార్థుల ఆందోళన
వారిని అడ్డుకున్న పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఎంత చెప్పినా వినకపోవడం వల్ల అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం వల్ల ఉద్రిక్తత నెలకొంది.