బీటెక్ పూర్తి చేసిన తర్వాత విదేశీ విద్యే లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థుల ప్రణాళిక తలకిందులైంది. ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన వారు ఈ ఏడాది విదేశీ విద్యకు దూరంగా ఉండి.. స్వదేశంలోనే ఉద్యోగాలు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అనవసరంగా కష్టాలను ఎందుకు కొనితెచ్చుకోవడమన్న కోణంలో చాలామంది ఆలోచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మందికిపైగా ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో వివిధ కంపెనీల్లో ఎంపికయ్యారు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఎంఎస్ చదివేందుకు వెళ్లాలనుకునే వారు సైతం ప్రాంగణ నియామకాల్లో పాల్గొని ఆఫర్ లెటర్లు అందుకున్నారు. ఊహించని విధంగా కరోనా విరుచుకుపడటంతో విదేశీ చదువుకు ఏడాదిపాటు వెళ్లకపోవడమే మంచిదయింది అనుకుంటున్నారు.
విదేశీ విద్యకు దూరం.. కొలువుకే ప్రాధాన్యం - Students prefers Foreign jobs more than Foreign Studies
ఈ తరం ఉన్నత చదువులు చదివి.. విదేశాల్లో స్థిరపడాలన్న కోరికతో చాలా కష్టపడిపోతుంటారు. అయితే.. కరోనా ఈ సారి పరిస్థితుల్ని మొత్తం మార్చేసింది. ప్రపంచాన్ని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తలకిందులు చేసేసింది.
![విదేశీ విద్యకు దూరం.. కొలువుకే ప్రాధాన్యం Students prefers Foreign jobs more than Foreign Studies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6902686-483-6902686-1587604230885.jpg)
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండడం వల్ల అందరూ ఎక్కడికక్కడ లాక్డౌన్ అయిపోయి.. ఇళ్లకే పరిమితమయ్యారు. చాలా కంపెనీలు కూడా లాక్డౌన్ చేసేశాయి. కొన్ని కంపెనీలు ఇంటి నుంచే పని చేయించుకుంటున్నాయి. అయితే.. ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు మాత్రం ఇప్పటివరకు ఏ ఒక్క కంపెనీ కూడా ఆఫర్లను రద్దు చేస్తున్నామని సమాచారం ఇవ్వలేదని సీబీఐటీ, వాసవి, ఎంవీఎస్‌ఆర్ కళాశాలల ప్రాంగణ నియామకాల అధికారులు సీఎల్‌ఎన్ రెడ్డి, కిశోర్, ప్రసన్నకుమార్ తెలిపారు. కాకపోతే.. ప్రక్రియ కొంత ఆలస్యం కావొచ్చని అంచనా వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏటా సుమారు 50 వేల మంది ఇంజినీరింగ్ పూర్తి చేసుకుంటారు. ఈసారి కరోనా పరిస్థితుల నేపథ్యంలో డిసెంబరు నుంచి మొదలయ్యే స్ప్రింగ్ సీజన్‌పైనే ఆశలు పెట్టుకున్నారు.
ఇదీ చూడండి:ఆరోగ్య సిబ్బంది రక్షణకై కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్