Students makes sanitation works: ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలోని నందివెలుగులో.. ప్రాథమిక పాఠశాల విద్యార్థులే పారిశుద్ధ్య కార్మికులుగా మారారు. వారం రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు పాఠశాల వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు.. పాఠశాల ప్రాంగణంలోని చెత్తను సేకరించి డబ్బాల్లో మోసుకుంటూ ఊరి బయట పారబోస్తున్నారు. బడికి వెళ్లే మార్గంలో సీసీ రోడ్ల నిర్మాణం జరగడంతో.. చెత్త సేకరించేందుకు వెళ్లడం లేదని కార్మికులంటున్నారు.
పారిశుద్ధ్య కార్మికులుగా మారిన పాఠశాల విద్యార్థులు.. ఎందుకంటే..? - నందివెలుగులో పారిశుద్ధ్య కార్మికులుగా మారిన విద్యార్థులు
Students makes sanitation works: ప్రాథమిక పాఠశాల విద్యార్థులే పారిశుద్ధ్య కార్మికులుగా మారిన ఘటన.. ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలోని నందివెలుగులో జరిగింది. వారం రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు పాఠశాల వైపు కన్నెత్తి చూడకపోవటంతో.. విద్యార్థులే పాఠశాల ప్రాంగణంలోని చెత్తను సేకరించి డబ్బాల్లో మోసుకుంటూ ఊరి బయట పారబోస్తున్నారు.

Students makes sanitation works
పారిశుద్ధ్య కార్మికులుగా మారిన పాఠశాల విద్యార్థులు.. ఎందుకంటే..?
అయితే గ్రామంలో వీధుల్లోని చెత్త సేకరిస్తున్న కార్మికులు.. బడిలో చెత్త తొలగించేందుకు కుంటిసాకులు చెబుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పారిశుద్ధ్య కార్మికులతోనే చెత్తను తొలగిస్తామని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సీతాకుమారి తెలిపారు.
ఇవీ చదవండి: