తెలంగాణ

telangana

ETV Bharat / city

Students in CM Meeting: సీఎం సభలో అవస్థలు.. స్పృహ కోల్పోయిన విద్యార్థులు - students lost consciousness during the CM jagan meeting

Students in CM Meeting: శ్రీకాకుళం జిల్లాలో అమ్మఒడి మూడో విడత నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సరైన వసతులు కల్పించకపోవటంతో.. పలువురు విద్యార్థులు స్పృహ కోల్పోయారు. వెంటనే వారిని వైద్యశిబిరాలు తరలించారు. అక్కడ కనీసం ఫ్యాన్ సౌకర్యం కూడా లేకపోవటంతో.. స్పృహ కోల్పోయిన విద్యార్థినిలకు సిబ్బంది అట్టలతో గాలి విసిరారు.

Students in CM Meeting
స్పృహ కోల్పోయిన విద్యార్థులు

By

Published : Jun 27, 2022, 6:24 PM IST

Students in CM Meeting: ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో మూడో విడత అమ్మఒడి నిధుల విడుదల కార్యక్రమానికి హాజరైన మహిళలు విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. సీఎం కార్యక్రమానికి వచ్చిన పలువురు విద్యార్థినిలు స్పృహ తప్పి పడిపోయారు. తమ బిడ్డలకు స్పృహ కోల్పొవటంతో వారి తల్లులు బోరున విలపించారు. వైద్య శిబిరాలు వద్ద కూడా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయకపోవడంతో మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సీఎం సభలో అవస్థలు.. స్పృహ కోల్పోయిన విద్యార్థులు

శిబిరాలల్లో కనీసం ఫ్యానులు కూడా అందుబాటులో లేకపోవడంతో.. స్పృహ తప్పిపోయిన విద్యార్థినిలకు అట్టలతో గాలి విసిరి సిబ్బంది సపర్యలు చేశారు. విద్యార్థినిలు ఒక్కోక్కరిగా పడిపోవడంతో.. మిగిలిన విద్యార్థులు సభ ప్రాగణం నుంచి పరుగులు తీశారు. సీఎం మాట్లాడకముందే.. తీవ్ర ఉక్కపోతకు జనం సైతం బయటకు వెళ్లిపోయారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details