తెలంగాణ

telangana

ETV Bharat / city

Students Joy Ride in Hyderabad Metro హైదరాబాద్‌ మెట్రోలో విద్యార్థుల జాయ్ రైడ్ - Har ghar tiranga in telangana

Students Joy Ride in Hyderabad Metro ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ.. విద్యార్థులతో జాయ్ రైడ్ నిర్వహించింది. అమీర్‌పేట్ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ వరకు నిర్వహించిన ఈ జాయ్ రైడ్‌లో సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు మెట్రో అధికారులు కూడా పాల్గొన్నారు.

Students Joy Ride in Hyderabad Metro
Students Joy Ride in Hyderabad Metro

By

Published : Aug 16, 2022, 2:17 PM IST

Students Joy Ride in Hyderabad Metro: స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ విద్యార్థులతో కలిసి 'జాయ్ రైడ్' నిర్వహించింది. అమీర్‌పేట్ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ వరకు నిర్వహించిన ఈ 'జాయ్ రైడ్‌'లో విద్యార్థులతో కలిసి మెట్రో సిబ్బంది, అధికారులు సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పిలుపుతో 57 మెట్రో స్టేషన్లలో అన్ని మెట్రో రైళ్లను నిలిపివేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రయాణికులు, మెట్రో ఉద్యోగులు, అధికారులు జనగణమన ఆలపిస్తుండగా వారి కళ్లు చెమ్మగిళ్లాయి. వజ్రోత్సవాల్లో భాగంగా దివ్యాంగులైన విద్యార్థులతో పాటు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు మెట్రో జాయ్ రైడ్ అవకాశం కల్పించారు.

Mass National Anthem Singing in Telangana : రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములయ్యారు. హైదరాబాద్‌ జీపీవో సర్కిల్‌ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు. మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ అసదుద్దీన్‌ హాజరయ్యారు. నెహ్రు విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం సామూహిక జాతీయగీతం ఆలపించారు.

Mass National Anthem Singing in Hyderabad : సాంకేతికత సాయంతో భాగ్యనగరంలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతమయ్యేందుకు ట్రాఫిక్‌ పోలీసులు కీలకంగా వ్యవహరించారు. డిజిటల్‌ అనౌన్స్‌మెంట్‌ సిస్ట్‌మ్‌లో భాగంగా ఆన్‌లైన్‌ కనెక్టివిటీ ఉన్న అన్ని సిగ్నల్‌ పాయింట్లలో ‘జనగణమన’ ప్లే అయింది. దీనికోసం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ముందస్తుగా ప్రోగ్రాం చేసి 11:29:30 గంటలకు దాన్ని విడుదల చేశారు. తొలుత ‘అందరూ దయచేసి నిలబడండి.. జాతీయ గీతాలాపన చేద్దాం’ అనే సందేశాన్ని వినిపించారు.

ఆ తర్వాత రెండు సైరన్లు మోగిన అనంతరం జాతీయ గీతం ప్లే అయింది. మూడు కమిషనరేట్ల పరిధిలో ఆన్‌లైన్‌లో అనుసంధానమైన కూడళ్ల వద్ద రెడ్‌ సిగ్నల్‌ పడి ‘జనగణమన’ గీతం వచ్చేలా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ప్రోగ్రాం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయినట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details