తెలంగాణ

telangana

ETV Bharat / city

నడిరోడ్డుపై విద్యార్థినుల డిష్యుం డిష్యుం.. జుట్లు పట్టుకుని మరీ.! - విజయవాడ తాజా వార్తలు

Students clash in Vijayawada: వీధుల్లో, రోడ్లపై అబ్బాయిలు కొట్టుకోవడం ఎక్కడైనా జరిగేదే. చూసే వారు ఇది 'కామన్​' అని వారి దారిన వారు వెళ్లిపోవడం కూడా కామనే. వారి మధ్య గొడవలు.. గర్ల్​ఫ్రెండ్​ గురించో, మద్యం మత్తులో జరిగేవే. అదే నడిరోడ్డుపై అమ్మాయిలు గొడవపడితే.. ఒకరికొకరు జుట్లు పట్టుకుని పిడిగుద్దులు కురిపించుకుంటే.. చూసేవారికి అదో విచిత్రం. ఆగి మరీ అదో వింతలా చూస్తారు. ఇక్కడా అంతే.. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Students clash in Vijayawada
నడిరోడ్డుపై విద్యార్థినుల డిష్యుం డిష్యుం

By

Published : Apr 23, 2022, 2:34 PM IST

Students clash in Vijayawada: ఓ కళాశాల విద్యార్థినులు నడి రోడ్డుపై బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ.. జుట్లు పట్టుకుని మరీ ఘర్షణకు దిగారు. తగ్గేదేలే అంటూ తమ బలాన్ని ప్రదర్శించారు. ఆడవాళ్లు ఇలా గొడవపడటం కామన్​ కానీ.. చదువుకునే అమ్మాయిలు ఇలా కొట్టుకుంటున్నారేంటి అక్కడున్న వాళ్లు నోరెళ్లబెట్టి చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ వన్​టౌన్ కేబీఎన్ కళాశాల సమీపంలో ఈ సన్నివేశం కెమెరా కంటపడింది.

కళాశాల తరగతి గదిలో ఏమైందో ఏమో కానీ... కాలేజీ వదిలిన వెంటనే బయటికి వచ్చిన విద్యార్థినులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో ముష్టి యుద్ధానికి దిగారు. ఇప్పటి వరకు విద్యార్థులు వీధి పోరాటాలకు దిగటం అందరూ చూశారు. కానీ... ఇలా విద్యార్థినులు వీధిపోరాటాలు, ముష్టి యుద్ధాలు చేసుకోవడం చూసి స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. విద్యార్థినులు కొట్టుకున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్​చల్ చేస్తున్నాయి.

నడిరోడ్డుపై విద్యార్థినుల డిష్యుం డిష్యుం

ABOUT THE AUTHOR

...view details