Protest: పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులను అడ్డుకున్న విద్యార్థి సంఘాలు - student unions protest against exams in telangana
10:01 July 05
పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులను అడ్డుకున్న విద్యార్థి సంఘాలు
ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ, జేఎన్టీయూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. హైదరాబాద్ మీర్‌పేటలోని టీకేఆర్ కళాశాల వద్ద పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులను విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి.
మరోవైపు పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. 18 ఏళ్లు నిండిన వారికి ఈ మధ్యే టీకాలు వేయడం ప్రారంభించగా.... చాలా మంది విద్యార్థులు వ్యాక్సిన్ తీసుకోలేదని అన్నారు. ముందు విద్యార్థులకు వ్యాక్సిన్ అందించి... తర్వాత పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పరీక్షలు ఆన్ లైన్ లో నిర్వహిస్తామంటూ... వర్సిటీలు నోటిఫికేషన్ ఇచ్చాయని... కానీ ఇప్పుడు ఆఫ్ లైన్ లో నిర్వహిస్తున్నాయని మండిపడ్డారు. కనీసం ఆన్లైన్లోనైనా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చదవండి :మంత్రి సబిత నివాసాన్ని ముట్టడించిన విద్యార్థులు