తెలంగాణ

telangana

ETV Bharat / city

ఫలితాల్లోనే కాదు.. ఆత్మహత్యల్లోనూ అమ్మాయిలదే పైచేయి

ఇంటర్​ ఫలితాలు వచ్చాయి. అమ్మాయిలదే పైచేయి... కానీ ఆ ఆనందం ఎంతోసేపు మిగలలేదు. సంతోషంలో విషాదం మిగిలింది. ఎందుకంటే... ఆత్మహత్యల్లోనూ అమ్మాయిలదే పైచేయి అయింది. పరీక్షల్లో తప్పామని రాష్ట్రంలో విద్యార్థినిలు వరుసగా బలవన్మరణానికి పాల్పడుతున్నారు.

By

Published : Apr 19, 2019, 5:24 PM IST

ఫలితాల్లోనే కాదు.. ఆత్మహత్యల్లోనూ అమ్మాయిలదే పైచేయి

పరీక్షలు తప్పితే... జీవితం కోల్పోయినట్లు భావిస్తున్నారు విద్యార్థులు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందులోనూ అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉండటం మరింత బాధాకరం. అమ్మాయిలంటేనే సున్నిత మనస్సు కలిగిన వారు. ఎవరు ఏం అనుకుంటారోనని భయానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.

ఫలితాల్లోనే కాదు.. ఆత్మహత్యల్లోనూ అమ్మాయిలదే పైచేయి

తాజాగా సికింద్రాబాద్​ గాంధీనగర్​ పీఎస్​ పరిధిలో అనామిక అనే విద్యార్థిని ఇంటర్​ పరీక్షల్లో తప్పానని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని ప్రాణాల్ని విడిచింది.

నిజామాబాద్​లో వెన్నెల అనే అమ్మాయి ఇంటర్మీడియట్​ రెండో సంవత్సరంలో రెండు సబ్టెక్టులు తప్పింది. ఈ విషయం జీర్ణించుకోలేని వెన్నెల ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ మృతి చెందింది.

హైదరాబాద్​ కూకట్​పల్లి బాలాజీనగర్​లో అవంతిక అనే అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే కాపాడారు.

ఇదీలా ఉంటే... వరంగల్​ జిల్లా కాజీపేటలో పరీక్షల్లో తప్పాను అనే కారణంతో మరో విద్యార్థి క్షణికావేశంలో ప్రాణాల్ని తీసుకున్నాడు. నిన్న ఫలితాలు చూసుకున్న భానుకిరణ్ అనే విద్యార్థి... రైల్వేట్రాక్​పై పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాణాల్ని విడిచి కన్నవారికి కడుపుకోతను మిగిల్చాడు.

మరోవైపు మేడ్చల్​ జిల్లా కుషాయిగూడ మరో విషాదం చోటుచేసుకుంది. నాగేందర్ అనే విద్యార్థి పరీక్ష తప్పానని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంటర్​ పరీక్ష ఫలితాలు విడుదలై... కొందరి జీవితాల్లో వెలుగులు నింపితే... మరికొందరి జీవితాల్లో చికటిని మిగిల్చాయి. ఏది ఏమైనా ప్రతియేటా పరీక్షలు వస్తుంటాయి.. జీవితం మాత్రం ఒక్కసారి కోల్పేతే మళ్లీ తిరిగిరాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

ఇదీ చూడండి:ఇంటర్​లో ఫెయిల్... విద్యార్థిని సూసైడ్..

ABOUT THE AUTHOR

...view details