తెలంగాణ

telangana

ETV Bharat / city

కేంద్ర మంత్రి ఇంటి ముందు విద్యార్థుల ఆందోళన

తెలంగాణ విద్యార్థి ఐశ్వర్య ఆత్మహత్య ఘటనపై.. కేంద్ర మంత్రి రమేశ్​ పొక్రియాల్ ఇంటి ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్​గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

student organizations protest at central minister ramesh pokrial house
కేంద్ర మంత్రి ఇంటి ముందు విద్యార్థుల ఆందోళన

By

Published : Nov 9, 2020, 8:27 PM IST

దిల్లీ యూనివర్సిటీలో చదువుతూ ఆర్థిక ఇబ్బందులతో తెలంగాణ విద్యార్థిని ఐశ్వర్య ఆత్మహత్య ఘటనపై ఎన్ఎస్‌యూఐ, దిల్లీ తెలుగు స్టూడెంట్స్ అసోషియేషన్.. కేంద్రమంత్రి రమేశ్​ పొక్రియాల్​ ఇంటి ఎదుట నిరసన చేపట్టారు. విద్యార్థులకు స్కాలర్​షిప్​లు విడుదల చేయకపోవడమే ఐశ్వర్య ఆత్మహత్యకు పాల్పడిందని, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్​గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్​కు తరలించారు.

ఫరూఖ్‌నగర్‌కు చెందిన ఐశ్వర్య(19) మెకానిక్‌గా పనిచేసే శ్రీనివాస్‌రెడ్డి, సుమతిల కుమార్తె. ఈ అమ్మాయి దిల్లీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కరోనా నేపథ్యంలో ఇటీవల ఇంటికి వచ్చిన ఆమెకు ఓ సందేశం అందింది.. దిల్లీ వసతి గృహం నుంచి ఖాళీ చేయాలనేది దాని సారాంశం. అక్కడ ఖాళీ చేసి మరోచోట ఉండాలంటే డబ్బు కావాలి. కుటుంబ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.

అసలేం జరిగింది..

ఈ నేపథ్యంలో అప్పుల కోసం, ఆర్థిక సహాయం కోసం ఆ తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు. ఇదే సమయానికి తండ్రికి కామెర్ల బారిన పడడం వల్ల అదనపు ఖర్చులు వేధించాయి. కుటుంబంలో పూట గడవని పరిస్థితి తలెత్తింది.. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది.

ఇదీ చూడండి:విద్యార్థిని ఆత్మహత్య... ఆర్థిక పరిస్థితులే కారణం

ABOUT THE AUTHOR

...view details