Student Drunk Acid: ఏపీ విజయవాడలోని ఎనికెపాడులో దారుణం జరిగింది. ఓ యువకుడికి దాహంగా ఉందని.. వాటర్ బాటిల్ కోసం షాపు దగ్గరికి వెళ్లాడు. కొట్టు యజమాని నిర్లక్ష్యంతో వాటర్ బాటిల్ బదులు యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. దాహంతో బాటిల్‌లోని యాసిడ్‌ను మంచినీళ్లు అనుకొని చైతన్య తాగాడు. యాసిడ్ తాగడంతో చైతన్య తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. దీంతో చైతన్య పరిస్థితి విషమంగా ఉంది. చైతన్య లయోలా కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. చైతన్య వైద్యానికి కళాశాల యాజమాన్యం విరాళాలు సేకరిస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Student Drunk Acid: వ్యాపారి నిర్లక్ష్యం.. వాటర్‌కు బదులుగా... యాసిడ్ తాగేశాడు! - విజయవాడ తాజా వార్తలు
Student Drunk Acid: ఏపీ విజయవాడలోని ఎనికెపాడులో దారుణం చోటుచేసుకుంది. వ్యాపారి నిర్లక్ష్యంతో డిగ్రీ విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Student