తెలంగాణ

telangana

ETV Bharat / city

కాలేజీలో ఒత్తిడి తట్టుకోలేక.. విద్యార్థి అదృశ్యం

చదువు ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థి కాలేజ్ నుంచి పారిపోయిన సంఘటన బాచుపల్లి పీఎస్​ పరిధిలో చోటు చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు...సీసీ ఫుటేజ్​ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Student can withstand stress .. student disappears
చదువు ఒత్తిడి తట్టుకోలేక.. విద్యార్థి అదృశ్యం

By

Published : Jan 9, 2020, 8:25 AM IST


మేడ్చల్​ జిల్లా బాచుపల్లి గ్రామంలో నివాసం ఉండే వెంకటేశ్వర రెడ్డి తన కొడుకు ధనుంజయ రెడ్డిని.. నిజాంపేట్ లోని శ్రీ చైతన్య రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్​లో ఎంపీసీ మొదటి సంవత్సరంలో చేర్పించాడు. పరీక్షల్లో మార్కులు తక్కువ రావడంతో... యాజమాన్యం తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసింది.

దీంతో భయాందోళనకు గురైన ధనుంజయ రెడ్డి బుధవారం సాయంత్రం కాలేజ్ నుంచి అదృశ్యమయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు...సీసీ ఫుటేజ్​ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

చదువు ఒత్తిడి తట్టుకోలేక.. విద్యార్థి అదృశ్యం

ఇవీ చూడండి: రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఏఎస్సై మృతి

ABOUT THE AUTHOR

...view details