తెలంగాణ

telangana

ETV Bharat / city

వీధి కుక్కల దాడి.. నాలుగేళ్ల బాలుడు మృతి - 4years boy deat street dogs attacks at kurnool

ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో మంగళవారం అర్థరాత్రి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

street-dogs-attacks-in-4-years-boy-at-kurnool-district
వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి

By

Published : Jun 3, 2020, 8:48 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దారుణం జరిగింది. అర్థరాత్రి వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. పోలీసులైను వీధిలో నరసింహా అనే బాలుడు ఇంటి నుంచి ఒంటరిగా బయటకు రాగా కుక్కలు మీదపడ్డాయి. ఒక్కసారిగా దాడి చేయడం వల్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

స్థానికులు వచ్చి కుక్కలను ఆపేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. బాలుడిని అతని తల్లి ఒంటరిగా వదిలి నంద్యాల వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

ఇవీ చూడండి: చిన్నారి ప్రాణం తీసిన బకెట్.. తల్లడిల్లిన మాతృ హృదయం

ABOUT THE AUTHOR

...view details