ఉక్కు నిరసనకారుల ముట్టడితో విశాఖ కలెక్టరేట్ జనసంద్రమైంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ నేతృత్వంలో సరస్వతి పార్కు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చిన ఉద్యమకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలనే నినాదాలతో హోరెత్తించారు. పోటెత్తిన జన ప్రవాహంతో కలెక్టరేట్‌కు వెళ్లే అన్ని మార్గాల్లో వాహనాలు నిలిచిపోయాయి. ముందుకు దూసుకొస్తున్న జనాన్ని అడ్డుకోవడం పోలీసు సిబ్బందికి శక్తికి మించిన పనిగా మారింది.
విశాఖ కలెక్టరేట్‌ను ముట్టడించిన ఉక్కు ఉద్యమకారులు - ఏపీ తాజా వార్తలు
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలనే నినాదాలతో ఉద్యమకారులు విశాఖ కలెక్టరేట్‌ను ముట్టడించారు. సరస్వతి పార్కు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చిన ఉద్యమకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.
విశాఖ కలెక్టరేట్‌ను ముట్టడించిన ఉక్కు ఉద్యమకారులు