ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారంలో స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని యాజమాన్యం ప్రకటించింది. 15 ఏళ్లు సర్వీసు ఉండి, 45 ఏళ్లు పూర్తి అయినవారు దీనికి అర్హులని స్టీల్ ప్లాంట్ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండు రకాలుగా మార్గదర్శకాలను ఎంపిక చేసుకొనే అవకాశం కల్పించారు.
విశాఖ ఉక్కు పరిశ్రమలో స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటన - visakha Steel Plant latest news update
15 ఏళ్లు సర్వీసు ఉండి, 45 ఏళ్లు పూర్తైనవారు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసే పథకాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విడుదల చేసింది. ఈ పథకం పొందేందుకు ఎప్పటి నుంచి దరఖాస్తులు చేసుకోవాలనేది త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించింది.
విశాఖ ఉక్కు పరిశ్రమ
ఎగ్జిక్యూటివ్ కేడర్లో రెండు స్థాయిల వరకు, నాన్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అందరూ ఈ పథకం పరిధిలోకి వస్తారు. వైద్యులు, ప్రత్యేక శిక్షణ పొందిన వారు, ఉన్నత సాంకేతిక విద్యార్హతలు ఉన్న వారు, విదేశాల్లో శిక్షణ పొందిన సిబ్బందికి ఈ పథకం వర్తించదని స్టీల్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ పథకం పొందాలి అనుకునేవారు ఎప్పటినుంచి దరఖాస్తులు చేసుకొవాలన్నది త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది.
- ఇవీ చూడండి...గనిలో ఆమెదే మొదటి అడుగు