ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై స్టే పొడిగింపు - stay-extension on dharani portal pill
13:16 January 22
'ఒకే అంశంపై అనేక పిటిషన్లు అవసరం లేదు'
ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై హైకోర్టులో దాఖలైన ఏడు వ్యాజ్యాలపై సీజే జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఒకే అంశంపై అనేక పిటిషన్లు అవసరం లేదన్న ఉన్నత న్యాయస్థానం.. రెండు పిల్స్పైనే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. మరో 5 ప్రజాప్రయోజన వ్యాజ్యాలను తోసిపుచ్చింది.
ధరణి పోర్టల్‌పై అభ్యంతరాలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తున్నట్లు అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు విన్నవించారు. ప్రభుత్వ వైఖరి తెలిపేందుకు సమయం కావాలని కోరారు. ఏజీ వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం ధరణిపై మధ్యంతర ఉత్తర్వులను జూన్ 21వరకు పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
- ఇదీ చూడండి :ఇచ్చిన మాట నిలబెట్టుకున్నం: మంత్రి హరీశ్‌రావు