కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల్లో వాటా తగ్గింది. పన్నుల్లో రాష్ట్ర వాటా 2.133 శాతం నుంచి 2.102కు తగ్గిస్తూ 15వ ఆర్థికసంఘం సిఫారసు చేసింది. ఫలితంగా రాష్ట్రానికి పన్నుల్లో వాటాగా ఏడాదికి 13 వేల 990 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రానున్నాయి.
బడ్జెట్ ఎఫెక్ట్ : రాష్ట్రానికి తగ్గిన పన్నుల వాటా - 15 వ ఆర్థిక సంఘం సిఫారసు
కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి పన్నుల వాటా తగ్గింది. గతంతో పోలిస్తే 2 వేల 736 కోట్ల మేర తగ్గిస్తూ.. 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఫలితంగా 13వేల 990 కోట్లు కేంద్రం నుంచి రానున్నాయి.
state share in tax decreased in present annual budget
గత బడ్జెట్లో రాష్ట్రానికి పన్నుల్లో వాటా 16 వేల 726 కోట్లు కాగా.. ఆ మొత్తాన్ని 11వేల 731 కోట్లకు సవరించారు. తాజాగా ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్లో పనుల్లో వాటాగా 13వేల 990 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. గత బడ్జెట్తో పోలిస్తే 2 వేల 736 కోట్ల మేర తగ్గించారు.