MLC Ananthababu case: వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ని హతమార్చిన కేసును.. కాకినాడ ఎస్పీ పక్కదారి పట్టిస్తున్నారని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు ఆరోపించారు. అనంతబాబు, మరికొందరితో కలిసి కిరాతకంగా కారు డ్రైవర్‌ను చంపాడన్నారు. ఒక్కరే హత్య చేస్తే.. శరీరంపై 31, అంతర్గతంగా 3 గాయాలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. అనంతబాబును కాపాడేందుకే నేరచరిత్ర లేదని కోర్టుకు పోలీసులు తెలిపారన్నారు.
MLC Ananthababu case: 'అనంతబాబు కాల్‌డేటా ఎందుకు తీసుకోవడం లేదు?' - MLC anantha babu
MLC Ananthababu case: ఎస్సీ యువకుడిని హత్యచేసిన వ్యక్తికి.. వీఐపీ సౌకర్యాలు కల్పిస్తారా అని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు మండిపడ్డారు. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ని హతమార్చిన కేసును.. కాకినాడ ఎస్పీ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. అనంతబాబు కాల్‌డేటా తీసుకోవడంలో పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
' అనంతబాబు కాల్‌డేటా ఎందుకు తీసుకోవడం లేదు?'
అసలు హత్య ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పటికీ స్పష్టంగా చెప్పట్లేదని ఆరోపణలు చేశారు. ఎస్సీ యువకుడిని హత్యచేసిన వ్యక్తికి వీఐపీ సౌకర్యాలు కల్పిస్తారా అని నిలదీశారు. అనంతబాబు కాల్‌డేటా తీసుకోవడంలో పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. హత్య కేసులో మిగతా నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని సుబ్బారావు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: