తెలంగాణ

telangana

ETV Bharat / city

'దోహ, ఖతర్​ నుంచి తెలంగాణకు విమానాలు పెంచండి' - కేంద్ర విదేశాంగశాఖ మంత్రికి వినోద్​కుమార్​ లేఖ

దోహ, ఖతర్​లో ఉంటున్న తెలంగాణ వాసుల్ని స్వస్థలాలకు చేర్చాలంటూ కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్​కు రాష్ట్రప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ లేఖ రాశారు. ఆయా దేశాల నుంచి రాష్ట్రానికి విమానాల రాకపోకలను పెంచాలని కోరారు.

కేంద్ర విదేశాంగశాఖ మంత్రికి వినోద్​కుమార్​ లేఖ
కేంద్ర విదేశాంగశాఖ మంత్రికి వినోద్​కుమార్​ లేఖ

By

Published : Jun 12, 2020, 4:09 PM IST

కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయశంకర్​కు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ లేఖ రాశారు. దోహ, ఖతర్ దేశాల నుంచి హైదరాబాద్​కు విమానాల సంఖ్యను పెంచాలని కోరారు.

దోహ, ఖతర్​లో ఉంటున్న సుమారు 70 వేల మంది తెలంగాణ వాసులు స్వస్థలాలకు రాలేక ఇబ్బంది పడుతున్నారని.. అక్కడి తెలంగాణ జాగృతి ప్రతినిధులు వినోద్ కుమార్​కు లేఖ రాశారు. ఇప్పటికే 3,500 మంది భారత ఎంబసీలో పేర్లు నమోదు చేయించుకున్నారని వివరించారు. ప్రస్తుతం ఆయా దేశాల నుంచి ఒకే విమానం నడుస్తోందని.. అందులో 183 మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంటోందన్నారు. పలువురు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వినోద్​ దృష్టికి తీసుకువచ్చారు. మరికొందరి వీసా గడువు ముగిసిందన్నారు.

స్పందించిన వినోద్ కుమార్.. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల్ని స్వస్థలాలకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రికి లేఖ రాశారు.

ఇవీచూడండి:తెలంగాణ తల్లి ప్రార్థన గీతాన్ని విడుదల చేసిన కేటీఆర్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details