ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనాకు ఇస్తున్న ఆయుర్వేద మందుపై శాస్త్రీయ అధ్యయనం జరపనున్నట్లు ఏపీ ఆరోగ్య శాఖ తెలిపింది. ఆయుష్ విభాగ ఉన్నతాధికారులు.. సోమవారం నుంచి ఈ మందును పరిశీలించనున్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మందు తయారీ విధానం, దానిని వాడినవారి అభిప్రాయాలు సేకరించినట్లు చెప్పారు. కేంద్ర ఆయుష్ విభాగం ఉన్నతాధికారులతో చర్చించినట్లు వెల్లడించారు.
'కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై సోమవారం నుంచి శాస్త్రీయ పరిశీలన' - సోమవారం నుంచి కొవిడ్ ఆయుర్వేద మందుపై ఆయుష్ విభాగం పరిశీలన
కరోనాకు ఆయుర్వేద మందుగా చెబుతున్న కృష్ణపట్నం ఔషధాన్ని.. కేంద్ర ఆయుష్ విభాగం ఉన్నతాధికారులు పరిశీలించనున్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వినియోగించిన వారిలో ఎటువంటి దుష్ఫలితాలు కనిపించలేదని ఆయన స్పష్టం చేశారు.
!['కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై సోమవారం నుంచి శాస్త్రీయ పరిశీలన' singal on krishnapatnam ayurvedic taza breaking](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11849408-188-11849408-1621611024916.jpg)
ఏపీ వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్
ఆనందయ్య తయారు చేస్తున్న కరోనా ఔషధం వాడిన వారంతా సంతృప్తిగా ఉన్నట్లు సింఘాల్ పేర్కొన్నారు. మందులోని మూలికలు, పదార్థాలతో దుష్ఫలితాలు ఏమీ కనిపించలేదన్నారు. ఔషధ వినియోగం వల్లే కరోనా తగ్గిందా.. వైరస్ తీవ్రత మందగించడం వల్ల నయమైందా అనే విషయంపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. కృష్ణపట్నంలోని కరోనా కేసులను నిశితంగా గమనించాలని సూచించినట్లు వివరించారు.