సెప్టెంబరు 1 నుంచి ప్రభుత్వ కళాశాలల్లో ఆన్‌లైన్ తరగతులు - colleges open
15:15 August 25
సెప్టెంబరు 1 నుంచి ప్రభుత్వ కళాశాలల్లో ఆన్‌లైన్ తరగతులు
సెప్టెంబరు 1 నుంచి ప్రభుత్వ కళాశాలల్లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు జరపాలని విద్యాశాఖ తెలిపింది.
ఈనెల 27 నుంచి అధ్యాపకులు కళాశాలలకు హాజరుకావాలన్న విద్యాశాఖ.. సుప్రీంకోర్టు కేసు తేలాక డిగ్రీ, యూజీ పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. మరోవైపు కరోనా జాగ్రత్తలతో అన్ని ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.