తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రతి ఒక్కరూ ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలి: పార్థసారధి - నగరవాసులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి విజ్ఞప్తి

నగరవాసులు తమ ఓటుహక్కును వినియోగించుకొని సమర్థులైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ పార్థసారధి సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు.

state election commissioner parthsaradhi appeal to every one use vote
ప్రతి ఒక్కరూ ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలి: పార్థసారధి

By

Published : Nov 28, 2020, 11:20 PM IST

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును కచ్చితంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి కోరారు. పోలింగ్ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. సమర్థులైన ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఇదే మంచి అవకాశమన్నారు.


ప్రతి ఒక్కరూ ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలి: పార్థసారధి

పోలింగ్ ఏజెంట్ లేదా రిలీవ్​ ఏజెంట్​గా... ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటరును లేదా నివాసిని మాత్రమే నియమించుకోవాలనే నిబంధనను రాష్ట్ర ఎన్నికల సంఘం సవరించింది. అభ్యర్థి వార్డులోని ఓటరుగా ఉన్న ఎవరినైనా నియమించుకునేందుకు అనుమతిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.

ఇదీ చూడండి:బల్దియా ఎన్నికలపై పోలీస్ నిఘా.. సమస్యాత్మక ప్రాంతాలకు బలగాలు

ABOUT THE AUTHOR

...view details