పురపాలక ఎన్నికల సన్నద్ధతపై ఎస్‌ఈసీ సమీక్ష - పురపాలక ఎన్నికల సన్నద్ధత
11:52 January 13
.
పురపాలక ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు, సన్నద్దతపై రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించింది. హైదరాబాద్ ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. పురపాలక శాఖ సంచాలకులు శ్రీదేవి, అధికారులు ఈసమావేశంలో పాల్గొన్నారు. 129 చోట్ల నామినేషన్ల ఉపసంహరణ గడువు రేపటితో ముగియనుంది. కరీంనగర్లో మరో మూడు రోజుల్లో నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కానుంది.
ఓటర్ల జాబితా, బ్యాలెట్ పత్రాల ముద్రణపై చర్చ
ఇవాళ పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాల తయారీ, బ్యాలెట్ పత్రాల ముద్రణ సన్నద్ధతపై ఈసీ సమీక్ష నిర్వహించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, అభ్యర్థుల ఖర్చు పర్యవేక్షణ కోసం స్క్వాడ్స్ ఏర్పాటు విషయమై కూడా దృష్టి సారించనున్నారు. ఎన్నికల సామాగ్రి కోసం పంపిణీ కేంద్రాలు, లెక్కింపు కేంద్రాల గుర్తింపు, ఖరారుపై కూడా చర్చించనున్నారు. పోలింగ్ రోజు వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు, సున్నిత, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు తదితర అంశాలపైనా నాగిరెడ్డి కలెక్టర్లతో సమీక్షించారు.