Consumer Commission: హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌కు లోపభూయిష్టమైన జామ్ విక్రయించినందుకు పరిహారం చెల్లించాల్సిందేనని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన జైపాల్‌రెడ్డి తిరుచ్చిలోని లయన్ డేట్స్ ఇంపెక్స్ లిమిటెడ్ నుంచి ఒకటి కొంటే ఒకటి ఉచితం ఆఫర్ కింద హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన జామ్ కొనుగోలు చేశారు. ఇంటికెళ్లి చూడగా అందులో తేనెటీగ కనిపించింది. దాన్ని వాపసు చేయడానికి ప్రయత్నించగా దుకాణదారు నిరాకరించారు.
హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌కు వినియోగదారుల కమిషన్ షాక్.. - హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్
Consumer Commission: లోపభూయిష్టమైన జామ్ విక్రయించినందుకు పరిహారం చెల్లించాల్సిందేనని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌కు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఒకటి కొంటే ఒకటి ఉచితం ఆఫర్ కింద జామ్ కొనుగోలు చేశారు. దాంతో నష్టపోయిన బాధితుడు జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేశాడు.

రాష్ట్ర వినియోగదారుల కమిషన్
జైపాల్‌రెడ్డి జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేయగా రూ.20 వేలు పరిహారం, ఖర్చుల కింద రూ.3 వేలు, ఉచితంగా 5 సీసాలు ఇవ్వాలని ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ హెరిటేజ్ ఫుడ్స్ దాఖలు చేసిన అప్పీలుపై రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ ఎమ్మెస్కే జైశ్వాల్, సభ్యురాలు మీనా రామనాథన్‌లతో కూడిన ధర్మాసనం జిల్లా వినియోగదారుల ఫోరం ఇచ్చిన ఉత్తర్వులను ఖరారు చేస్తున్నామంటూ హెరిటేజ్ ఫుడ్స్ అప్పీలును కొట్టివేసింది.