తెలంగాణ

telangana

ETV Bharat / city

'భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలుగుతోంది'

ప్రజా సమస్యలపై చట్టబద్ధంగా పోరాడుతున్న వారిని.. మావోయిస్టు అనుబంధ సంఘాల పేరిట ప్రభుత్వాలు వేధింపులకు గురిచేస్తున్నాయని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. ప్రజా కళామండలి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

state-civil-rights-association-denied-praja-kalamandali-secretary-arrest
'భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలుగుతోంది'

By

Published : Dec 23, 2020, 4:08 PM IST

ప్రజా కళామండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు అరెస్ట్​ను.. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ఖండించారు. ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లిన ఏపీ పోలీసులు.. ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్​లోని ప్రజా కళామండలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన కోటేశ్వరరావును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఏపీ పోలీసులు రాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చి.. ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు లక్ష్మణ్. సీఎం కేసీఆర్ చొరవతోనే ఏపీ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో.. భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలుగుతోందన్నారు. అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా ప్రజా, మహిళ, కార్మిక, విద్యార్థి, రచయితలు, మేథావులు, జర్నలిస్టులపై ఉపా చట్టం కింద కుట్రపూరితంగా.. అక్రమ కేసులు బనాయిస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. ప్రజా సమస్యలపై చట్టబద్ధంగా పోరాడుతున్న వారిని.. మావోయిస్టు అనుబంధ సంఘాల పేరిట ప్రభుత్వాలు వేధింపులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఉపా చట్టాన్ని రద్దు చేయడంతో పాటు.. అక్రమంగా అరెస్ట్ చేసిన ప్రజా సంఘాల నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:'విజయ్​ని విడుదల చేయాలి.. ఉపా చట్టం రద్దు చేయాలి'

ABOUT THE AUTHOR

...view details