తెలంగాణ

telangana

ETV Bharat / city

Shashank Goyal transferred: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ బదిలీ - State Chief Electoral Officer Shashank Goyal has been transferred

Shashank Goyal transferred: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ బదిలీ అయ్యారు. కేంద్ర కార్మికశాఖ అదనపు కార్యదర్శిగా శశాంక్ గోయల్ నియమితులయ్యారు. శశాంక్ గోయల్‌ను కేంద్ర సర్వీసులకు బదిలీ చేస్తూ... సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

Shashank Goyal transferred:
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ బదిలీ

By

Published : Jan 19, 2022, 8:33 AM IST

Shashank Goyal transferred: కేంద్ర కార్మికశాఖ అదనపు కార్యదర్శిగా 1990 బ్యాచ్‌ తెలంగాణ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి శశాంక్‌ గోయల్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా ఉన్న ఆయనను కేంద్ర సర్వీసులకు బదిలీచేస్తూ సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది.

మొత్తం 13 మంది అదనపు కార్యదర్శి స్థాయి అధికారులను బదిలీచేయగా అందులో శశాంక్‌ గోయల్‌ ఉన్నారు. అలాగే మధ్యప్రదేశ్‌ కేడర్‌కు చెందిన వీఎల్‌ కాంతారావు టెలీకమ్యూనికేషన్స్‌ శాఖ అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు.

ఇదీ చదవండి:online classes effect on eyes: ఆన్‌లైన్‌ తరగతులతో కళ్లపై ఒత్తిడి.. ఆరేడేళ్లకే అద్దాలు తప్పనిసరి!

ABOUT THE AUTHOR

...view details