సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - covid 19
కరోనా నేపథ్యంలో కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయ్యింది. ప్రగతిభవన్లో సమావేశం ప్రారంభమైంది. కరోనా వ్యాప్తి, ఉత్పన్నమైన పరిస్థితులపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.
![సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం State Cabinet meeting shortly](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6750850-246-6750850-1586598272632.jpg)
మరికొద్దిసేపట్లో సీఎం అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
హైదరాబాద్లోని ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. లాక్‌డౌన్ పొడిగింపు, ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్ వ్యూహ రూపకల్పనపై చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని పేదలు, వలస కార్మికులకు అందుతున్న సాయం, వ్యవసాయ కొనుగోళ్లు, వడగండ్ల వానతో జరిగిన నష్టం, తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. విద్యా సంబంధిత అంశాలపై కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
Last Updated : Apr 11, 2020, 3:50 PM IST