తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం ముందుకు బడ్జెట్‌..! - రాష్ట్ర మంత్రివర్గం ముందుకు బడ్జెట్‌..!

ఇవాళ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ఉభయసభల ముందుకు రానుంది. సాయంత్రం భేటీ కానున్న కేబినెట్.. బడ్జెట్​ను ఆమోదించడం సహా ఇతర కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

రాష్ట్ర మంత్రివర్గం ముందుకు బడ్జెట్‌..!

By

Published : Sep 8, 2019, 5:24 AM IST

Updated : Sep 8, 2019, 7:43 AM IST

హైదరాబాద్​ ప్రగతిభవన్​లో సాయంత్రం కేబినెట్ భేటీ జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్​ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలే ప్రధాన అజెండాగా మంత్రివర్గం భేటీ కానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్​పై కేబినెట్​లో చర్చించి ఆమోదిస్తారు.

మంత్రివర్గంలో బడ్జెట్​పై చర్చ

లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ పద్దు స్థానంలో ఇపుడు పూర్తి స్థాయి బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. రేపు ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే నేరుగా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం సమావేశం కానున్న మంత్రివర్గంలో దీనిపై చర్చించి ఆమోదిస్తారు.

ఆర్థిక పరిస్థితులపై వివరణ

దేశవ్యాప్తంగా అన్ని రంగాలపై మాంధ్యం ప్రభావంతో ఆదాయాలు తగ్గాయని... ఆ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శాఖలు నడుచుకోవాలని సీఎం కేసీఆర్​ స్పష్టం చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, పరిస్థితులను కూడా మంత్రి వర్గానికి వివరించనున్నారు. కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై చర్చ

సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. దీనిపై చర్చించి కొత్త సచివాలయ నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సచివాలయ నిర్మాణం కోసం బడ్జెట్​లో నిధులు కేటాయించనున్నట్లు సమాచారం.

ఉద్యోగ పోస్టుల భర్తీకి ఆమోదముద్ర

వివిధ శాఖల్లో పోస్టులు భర్తీకి కేబినెట్​ ఆమోదముద్ర వేయనుంది. పురపాలక ఆర్డినెన్స్, కొత్త రెవెన్యూ చట్టం విషయమై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రుణమాఫీ, ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితి పెంపుపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. రేపట్నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం సహా రాజకీయ పరిస్థితులపై కూడా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు.

ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం ముందుకు బడ్జెట్‌..!

ఇవీ చూడండి: శాసనమండలి చీఫ్ విప్​గా బోడకుంటి

Last Updated : Sep 8, 2019, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details