తెలంగాణ

telangana

ETV Bharat / city

పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరత - Staff shortage in urban and primary health centers

ఏడాది నుంచి కరోనా విలయ తాండవం చేస్తోంది. సుమారు రెండు నెలలుగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది.​ అయినా అనేక ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఫలితంగా కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణ.. మందులు పంపిణీపై ప్రభావం పడుతోంది.

Staff shortage in urban and primary health centers
పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరత

By

Published : Apr 28, 2021, 9:40 AM IST

  • డబీర్‌పురా పీహెచ్‌సీలో ఇటీవల వైద్యునితోపాటు మిగతా సిబ్బందికి కరోనా సోకింది. కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. దీంతో కాంట్రాక్టు సిబ్బందితో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.
  • వాస్తవానికి ఒక పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఒకరు లేదా ఇద్దరు వైద్యులతో సహ ఒక పబ్లిక్‌ హెల్త్‌ నర్సు(పీహెచ్‌ఎన్‌), 3 నుంచి 4మంది ఏఎన్‌ఎంలు, ఒక ల్యాబ్‌ టెక్నిషియన్‌, ఒక ఫార్మాసిస్ట్‌, ఆయా, అటెండరు మొత్తం 10 నుంచి 12 మంది వరకు ఉండాలి. నగరంలో అనేక కేంద్రాల్లో ముగ్గురు నుంచి
  • ఇక నగర శివార్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని ఆరోగ్య కేంద్రాల్లో 15 మందికి ఆరుగురు లేదా ఏడుగురితోనే నెట్టుకొస్తున్నారు. ఫలితంగా కొవిడ్‌ టెస్ట్‌ల్లో జాప్యం జరుగుతోంది.

ఒకవైపు కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం వేలాది మంది ఈ మహమ్మారి గుప్పిట పడి నలిగిపోతున్నారు. ఈ తరుణంలో పరీక్షల నుంచి చికిత్సల వరకు ఒక కట్టుదిట్టమైన పకడ్బందీ ప్రణాళిక ఉండాలి. అయితే మౌలిక వసతుల కొరతతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కరోనా రెండో విడతలో పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలపై భారీగా ఒత్తిడి పెరిగింది. అరకొర సిబ్బందితో ప్రజలకు టెస్టులు చేయడం.. మందులు పంపిణీ చేయడం సాధ్యం కావడం లేదు. రోగుల తాకిడి నేపథ్యంలో తక్షణం వైద్య ఆరోగ్యశాఖ స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ ఉదాహరణలు..

  • ముషీరాబాద్‌ అర్బన్‌హెల్త్‌ సెంటర్‌లో పూర్తిస్థాయి వైద్యాధికారి లేరు. డేటా ఎంట్రీ ఆపరేటరు, ఆయా, అటెండర్‌ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోలక్‌పూర్‌లో ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఫార్మాసిస్టు, సూపర్‌వైజర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
  • హబ్సిగూడ హెల్త్‌సెంటర్‌లో ముగ్గురు స్టాఫ్‌నర్సులు, ముగ్గురు ఏఎన్‌ఎంలు, ఒక ల్యాబ్‌ టెక్నిషీయన్‌, ఫార్మాసిస్టు కొరత వేధిస్తోంది. చర్లపల్లి పీహెచ్‌సీలో డాక్టర్‌, నర్సు, టెక్నిషియన్‌, ఫార్మాసిస్ట్‌ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
  • శివరాంపల్లి, హసన్‌నగర్‌ పీహెచ్‌సీల్లో డాక్టర్‌, స్టాఫ్‌నర్సులు, ల్యాబ్‌టెక్నీషియన్‌, ఫార్మాపిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
  • రాయదుర్గం పీహెచ్‌సీలో 12మందికి నలుగురు సిబ్బందే ఉన్నారు. బొగ్గులకుంట, ఈసామీబజార్‌, సుల్తాన్‌బజార్‌, కార్వాన్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో అరకొర సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు.

ఇవీచూడండి:'18 ప్లస్​'కు టీకా రిజిస్ట్రేషన్.. నేటినుంచే

ABOUT THE AUTHOR

...view details