పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ నెల 6న విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా గతనెల 10 నుంచి 24 వరకు నిర్వహించిన పరీక్షలకు... 36 వేల 931 మంది బాలురు, 24వేల 500 మంది బాలికలు హాజరయ్యారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులు ఫలితాలు ప్రకటించనున్నారు.
పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాల తేదీ ఖరారు - ssc
పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 6న పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో ఫలితాలు విడుదల చేయనున్నారు.

పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాల తేదీ ఖరారు