ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల - ap ssc, inter exams schedule
13:20 February 10
ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
AP SSC and Inter Exams: ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు గంట మోగింది. ఈ మేరకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. మే 2 నుంచి మే 13 వరకు టెన్త్, ఏప్రిల్ 8 నుంచి 28వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయని తెలిపింది.
ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల షెడ్యూల్ను ఏపీ మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు.
ఇదీ చదవండి: