SRSP and Sagar projects water flow: రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టులోకి ప్రస్తుతం ఎగువ నుంచి 80వేల 570 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఎస్సారెస్పీ నుంచి 71వేల760 క్యూసెక్కుల వరద నీటిని 19 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ఎస్కెప్ గేట్ల ద్వారా 6వేలు క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా మరో 2వేలు క్యూసెక్కులు నీటిని పంపుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా 90.313 టీఎంసీల నీరు వచ్చి చేరడంతో నిండు కుండలా మారింది.
గోదావరి, కృష్ణా నదులకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం..
SRSP and Sagar projects water flow: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు, నాగార్జున సాగర్‌కు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
మరోవైపు నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వచ్చిన వరద నీటిని 14 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు పంపిస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 588 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 588 అడుగులుగా ఉంది. అలాగే పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం నిల్వ సామర్థ్యం 307 టీఎంసీలు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న 2లక్షల 51వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇవీ చదవండి: