తెలంగాణ

telangana

ETV Bharat / city

గిన్నిస్ రికార్డ్ టైటిల్ సాధించిన ఎస్ఆర్ఎం విద్యార్థిని - ap latets news

ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థిని వైష్ణవి గిన్నిస్ రికార్డ్ టైటిల్ సాధించింది. ఇంజినీరింగ్ టెక్నాలజీలో ఎదురవుతోన్న తాజా సవాళ్లపై అక్టోబరు 30న జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఇదే అంశంపై వైష్ణవి రూపొందించిన పరిశోధన పత్రం ప్రచురణ పొందింది. యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థిని వైష్ణవిని అభినందించింది.

guinness record
guinness record

By

Published : Dec 1, 2020, 10:42 PM IST

అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థిని వైష్ణవి గిన్నిస్ రికార్డ్ టైటిల్ సాధించింది. బ్లాక్​చైన్, సైబర్ సెక్యూరిటీని ఉపయోగించి ప్రాజెక్టుని విజయవంతంగా పూర్తి చేసింది. ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో వైష్ణవి... కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతోంది. ప్రతిష్ఠాత్మకమైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్​ను సొంతం చేసుకున్నట్లు యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది.

గిన్నిస్ రికార్డ్ టైటిల్ సాధించిన ఎస్ఆర్ఎం విద్యార్థిని

సైబర్ సెక్యూరిటీలో బ్లాక్​చైన్ టెక్నాలజీని వినియోగించడం ఇదే తొలిసారని యూనివర్సిటీ తెలిపింది. ఇంజినీరింగ్ టెక్నాలజీలో ఎదురవుతోన్న తాజా సవాళ్లపై అక్టోబరు 30న జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఇదే అంశంపై వైష్ణవి రూపొందించిన పరిశోధన పత్రం ప్రచురణ పొందింది. వైష్ణవి అభివృద్ధి చేసిన అప్లికేషన్ వల్ల కంప్యూటర్​లో ముఖ్యమైన డేటా చోరీకి గురయ్యే అవకాశం లేవని యూనివర్సిటీ వారు తెలిపారు.

guinness record

అంతేకాకుండా ఫేస్​బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియాలో ఉంచిన డేటాపై సైబర్ దాడి జరిగే అవకాశం తక్కువని వివరించారు. దీన్ని గుర్తించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కమిటీ... గిన్నిస్ సర్టిఫికెట్​ను ప్రదానం చేసింది. ఆన్​లైన్ ద్వారా ధ్రువపత్రం పంపినట్లు విశ్వవిద్యాలయం బాధ్యులు తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థిని వైష్ణవిని అభినందించింది.

ఇదీ చదవండి :తెరాస గెలుపు కోసం పనిచేసిన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు : కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details