తెలంగాణ

telangana

ETV Bharat / city

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల - SRIVARI SEVA TICKETS RELEASED BY TTD

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. 2020 ఏప్రిల్‌ నెలకు సంబంధించి 65 వేల 280 టిక్కెట్లను అందుబాటులో ఉంచింది.

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల

By

Published : Jan 3, 2020, 1:13 PM IST

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను తితిదే విడుదల చేసింది. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన 65 వేల 280 ఆర్జిత సేవా టిక్కెట్లను తితిదే వెబ్‌సైట్‌లో అధికారులు అందుబాటులో ఉంచారు. ఇందులో 10 వేల 680 సేవా టిక్కెట్లను ఆన్​లైన్ డిప్‌ విధానంలో కేటాయించారు. సుప్రభాత సేవకు 7 వేల 920, తోమాలసేవకు 140, అర్చనకు 140, అష్టాదళ పాదపద్మారాధన సేవకు 180, నిజపాద దర్శనానికి 2 వేల 300 టిక్కెట్లు కేటాయించారు.

సాదారణ పద్ధతిలో 54 వేల 600 టిక్కెట్లను అందుబాటులో ఉంచగా... అందులో విశేషపూజ 15 వందలు, కళ్యాణోత్సవం 12 వేల 825, ఊంజల్‌సేవ 4 వేల 50, వసంతోత్సవం 13 వేల 200, సహస్రదీపాలంకరణసేవ 15 వేల 600, ఆర్జిత బ్రహ్మోత్సవం 7 వేల 425 టిక్కెట్లు ఉన్నాయి.

ఇవీ చూడండి:తిరుమల లడ్డూలపై తితిదే కీలక నిర్ణయం... ఇకపై..

ABOUT THE AUTHOR

...view details